ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి

ఇతీరియము అప్లికేషన్లు

ఇతీరియములోని యాప్‌లు ఉచితం, ప్రపంచవ్యాప్తం మరియు ప్రైవేట్ కంపెనీ సర్వర్‌లకు బదులుగా పబ్లిక్ బ్లాక్ చైనును ఉపయోగిస్తాయి. అంటే మీరు ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఒకే ఖాతాను ఉపయోగించవచ్చు మరియు మీ గోప్యతను కాపాడుకోవచ్చు.

అద్భుత శక్తులున్న యాప్‌లు

ఇతీరియము అప్లికేషన్లు సాధారణ యాప్‌ల లాగానే అనిపించవచ్చు. కానీ తెరవెనుక వాటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ఒకసారి యాప్ ఇతీరియము బ్లాక్ చైనులో ప్రచురించబడితే, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే ఇతీరియము నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా వేలాది కంప్యూటర్లలో వికేంద్రీకరించబడింది. ఇతీరియముపై నడుస్తున్న యాప్‌లను ఎవరూ ఆపలేరు, ఎందుకంటే లక్ష్యంగా చేసుకోవడానికి ఒకే సర్వర్ లేదు. ఇతీరియము కూడా తటస్థంగా ఉంటుంది, కాబట్టి ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా దాన్ని ఉపయోగించవచ్చు లేదా దానికి కనెక్ట్ అయి దానిపై తమ మార్పులను నిర్మించుకోవచ్చు.

డాప్ అంటే ఏమిటి?

ఇతీరియము అప్లికేషన్లు వాటి లాజిక్‌ను కేంద్రీకృత సర్వర్లలో కాకుండా ఇతీరియము బ్లాక్ చైనుపై నడిపిస్తాయి. అందుకే వాటిని తరచుగా వికేంద్రీకృత అప్లికేషన్లు అని లేదా సంక్షిప్తంగా డాప్స్ అని పిలుస్తారు.

మరింత ప్రైవేట్

ఏ డాప్ అయినా ఉపయోగించడానికి మీకు ఎథేరియం వాలెట్ ఉంటే చాలు. మీ వ్యక్తిగత సమాచారం అవసరం లేదు. ఇంటర్నెట్ అంటే ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో

డాప్స్ ప్రాంతాలు మరియు యాప్ స్టోర్ల నియమాలచే పాలించబడవు. మీ యాక్సెస్ మీరు నివసించే ప్రదేశంపై కాకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

చౌకైన సేవలు

డాప్స్ పీర్-టు-పీర్. మధ్యవర్తులు వాటా తీసుకోరు, అంటే చౌకైన సేవలు లభిస్తాయి.

ఇది ఎందుకు ముఖ్యం

ఇతీరియము యాప్‌లు సాంప్రదాయ యాప్‌లతో సాధ్యం కాని పనులను చేయగలవు. ఉదాహరణకు, మీ డబ్బు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందనే హామీతో, పూర్తిగా అపరిచితుడికి డబ్బు అప్పుగా ఇవ్వడం. లావాదేవీని నిర్వహించడానికి లాయర్ వంటి “నమ్మకమైన” మధ్యవర్తికి చెల్లించకుండానే.

ప్రతిదానికీ యాప్‌లు ఉన్నాయి: గేమింగ్, ఫైనాన్స్, పని, మెసేజింగ్, నిల్వ మరియు మరెన్నో. చాలా యాప్‌లతో మీరు ప్రకటనలకు గురి కారు లేదా పరిమిత యాక్సెస్ ద్వారా పరిమితం చేయబడరు.

ఏదైనా ఇతీరియము యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించడానికి మీకు కావలసిందల్లా ఒక ఇతీరియము వాలెట్ మరియు కొద్దిగా ETH.

ఇది ఎలా పనిచేస్తుంది

యాప్‌లు స్మార్ట్ ఒప్పందాల ద్వారా శక్తిని పొందుతాయి — ఇవి ఇతీరియము బ్లాక్ చైనులో ఉండే కోడ్ ముక్కలు. సాంప్రదాయ యాప్‌లలా కాకుండా, వాటిని నడపడానికి ఒక కంపెనీ అవసరం లేదు.

లక్షణంసాంప్రదాయ యాప్‌లుఇతీరియము యాప్‌లు
దాన్ని ఎవరు నియంత్రిస్తారు?ఒక కంపెనీఎవరూ కాదు
దీనిపై నడుస్తుందిప్రైవేట్ కంపెనీ సర్వర్లుపబ్లిక్ ఇతీరియము బ్లాక్ చైను
దీన్ని సెన్సార్ చేయవచ్చా?అవునులేదు
మీ డేటా ఎవరిది?సాధారణంగా మీరు కాదుమీ డేటా మీదే

I

imrulo.eth

Serbia

I'm Cuban. I live in Serbia.From Cuba, opening a bank account was almost impossible. Paying online… even more difficult. When I arrived in Serbia, I thought everything would be easier. But in 2021, something happened to me that I'll never forget. A client asked me for a website. He paid me via PayPal. And PayPal… blocked my money. Just when I needed it most. That same day, I started looking for solutions. And I found Ethereum. That's when everything changed. Thanks to Ethereum, I was able to receive direct payments. Without banks. Without blocks. Without asking permission. Since then, I fell in love with Ethereum.Because it's not just money. It's freedom. It's being able to work and get paid, no matter where you come from. Every time I have something on another network, I try to move it to Ethereum.Because I believe in its potential. In its ability to give opportunities to people like me. People who come from countries where the system closes its doors to you. For me, Ethereum isn't just technology. It's a tool for living a better life.

April 26, 2025

Casio

Casio

@0xCasio

How DeFi has made an impact on my life: Spent 8 years working regular jobs, perfect credit, no debt and all banks denied my loan apps after months of back n forth. In less than 30 minutes I took a loan agains't my ETH which allowed me to buy the land and start construction.

March 24, 2025

T

Thiago

Brazil

In emerging regions, instability, distrust, and social inequality are commonplace. Ethereum offers not only a technological alternative, but a philosophical one. It allows us to build systems where transparency is default, trust is programmable, and access is open.

April 15, 2025

ఇతీరియము యాప్‌లు లెగోల లాంటివి

యాప్‌లన్నీ ఇతీరియముపై నిర్మించబడినప్పుడు, అవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒక యాప్ కోసం ఒక టోకెన్, పూర్తిగా భిన్నమైన దానిపై పని చేస్తుంది. ఇది మీ ఫేస్‌బుక్ వాల్‌పై ట్వీట్‌లను ప్రచురించగలగడం లాంటిది. నిజానికి తరచుగా మీరు ప్రతిచోటా విడిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అనేక విభిన్న ఇతీరియము యాప్‌లలో ఒకే ప్రొఫైల్‌ను తిరిగి ఉపయోగించవచ్చు.

Browse apps

We've listed some of the most popular apps out there so you can try one out. You'll need ETH and a wallet to get the most out of them.

Take a look
Aave

Aave

Lend your tokens to earn interest and withdraw any time.

Farcaster

Farcaster

The social and community platform of crypto.

Uniswap

Uniswap

Swap your tokens for different ones globally.

Ethereum

Powered by Ethereum

మరింత సమాచారం

తరచుగా అడిగే ప్రశ్నలు

డాప్ అంటే వికేంద్రీకృత అప్లికేషన్లు. ఇవి ఇతీరియము వంటి బ్లాక్ చైను నెట్‌వర్క్‌లపై నిర్మించబడిన అప్లికేషన్లు. వాటి ఆధారంగా ఉన్న నెట్‌వర్క్ వికేంద్రీకరించబడినందున వాటిని వికేంద్రీకృతం అని పిలుస్తారు.

కొన్ని అప్లికేషన్లు క్రిప్టో టోకెన్లను ట్రేడ్ చేయడానికి లేదా కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి, కానీ అన్ని యాప్‌లు దాని కోసం కాదు. మీరు మీ మొదటి టోకెన్లను కొనాలని చూస్తున్నట్లయితే, ETH పొందండిని సందర్శించండి.

క్రిప్టో వాలెట్ మీ టోకెన్లను ఉంచుకోవడానికి మరియు మీ ఇతీరియము ఖాతాను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అనేక గొప్ప వాలెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి వేరే ప్రయోజనాన్ని అందిస్తుంది. మీకు ఏ వాలెట్ ఉత్తమమైనదో తెలుసుకోవడానికి, మా వాలెట్ల జాబితాను సందర్శించండి.

పేజీ చివరి అప్‌డేట్: 27 సెప్టెంబర్, 2025

ఈ పేజీ ఉపయోగపడిందా?