ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎథీరియం మార్గదర్శకాలు

ప్రారంభకులకు ఎథీరియంను ఉపయోగించడం గురించిన ప్రాథమిక విషయాలను వివరించే ఆచరణాత్మక మార్గదర్శకాల సేకరణ.

మీరు మీ ఎథీరియం ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? మా ఆచరణాత్మక మార్గదర్శకాలు ఎలా ప్రారంభించాలో మీకు దశలవారీగా దారిచూపుతాయి మరియు ఈ కొత్త సాంకేతికతను సులభంగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

ప్రారంభించడం

  1. ఎథీరియం ఖాతాను ఎలా "సృష్టించాలి" - ఎవరైనా ఉచితంగా వాలెట్‌ను సృష్టించవచ్చు. ఎక్కడ ప్రారంభించాలో ఈ మార్గదర్శకం మీకు చూపుతుంది.

  2. వాలెట్‌ను ఎలా ఉపయోగించాలి - మీ వాలెట్‌లో టోకెన్‌లను ఎలా పంపాలి మరియు స్వీకరించాలి మరియు ప్రాజెక్ట్‌లకు వాలెట్‌ను ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకోండి.

భద్రతా ప్రాథమికాలు

  1. మీ క్రిప్టో నిధులకు స్మార్ట్ కాంట్రాక్ట్ యాక్సెస్‌ను ఎలా రద్దు చేయాలి - మీరు ప్రారంభించని లావాదేవీని అకస్మాత్తుగా మీ వాలెట్‌లో చూసినట్లయితే, అది మళ్లీ జరగకుండా ఎలా నిరోధించాలో ఈ మార్గదర్శకం మీకు నేర్పుతుంది.

  2. స్కామ్ టోకెన్‌లను ఎలా గుర్తించాలి - స్కామ్ టోకెన్‌లు అంటే ఏమిటి? అవి తమను తాము చట్టబద్ధమైనవిగా ఎలా చూపుతాయి మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మరియు మోసపోకుండా ఉండటానికి వాటిని ఎలా గుర్తించాలి?

ఎథీరియంను ఉపయోగించడం

  1. టోకెన్‌లను లేయర్ 2 (l2) కు ఎలా వారధి చేయాలి - ఎథీరియం లావాదేవీలు చాలా ఖరీదైనవా? లేయర్ 2 (l2) లు అని పిలువబడే ఎథీరియం స్కేలింగ్ పరిష్కారాలకు మారడాన్ని పరిగణించండి.

  2. టోకెన్‌లను ఎలా మార్పిడి చేయాలి - మీరు మీ టోకెన్‌లను వేరొకదానితో మార్చుకోవాలనుకుంటున్నారా? దీన్ని ఎలా చేయాలో ఈ సాధారణ మార్గదర్శకం మీకు చూపుతుంది.