ప్రాజెక్ట్‌లను జోడించడం
మేము వివిధ రకాల ప్రాజెక్ట్‌లను చూపుతామని మరియు DeSci ల్యాండ్‌స్కేప్ యొక్క మంచి స్నాప్‌షాట్‌ను అందించాలని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము.
Ethereum.orgలోని DeSci పేజీలో జాబితా చేయడానికి ఎవరైనా ప్రాజెక్ట్‌ను సూచించడానికి ఉచితం. అలాగే, ఇకపై సంబంధితంగా లేని లేదా మా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రాజెక్ట్‌ను ఎవరైనా గమనించినట్లయితే, దానిని తీసివేయమని సూచించవచ్చు.
నిర్ణయ చట్రం
చేర్చడానికి ప్రమాణాలు: తప్పనిసరిగా ఉండాల్సినవి
- ఓపెన్ సోర్స్ కోడ్/డేటా - కోడ్ మరియు డేటా యొక్క బహిరంగత ఒక ప్రధాన DeSci సూత్రం, కాబట్టి DeSci ప్రాజెక్ట్‌లు క్లోజ్డ్ సోర్స్ కాకూడదు. కోడ్‌బేస్ అందుబాటులో ఉండాలి మరియు PRలకు ఆదర్శంగా తెరవబడి ఉండాలి.
- DeSci ప్రాజెక్ట్‌లు నిరూపితంగా వికేంద్రీకరించబడాలి - ఇది DAO ద్వారా పరిపాలించబడటం లేదా కస్టోడియల్-కాని వాలెట్‌లతో సహా వికేంద్రీకృత టెక్ స్టాక్‌తో నిర్మించడం వంటివి కలిగి ఉండవచ్చు. ఇది బహుశా Ethereumలో ఆడిట్ చేయదగిన స్మార్ట్ ఒప్పందాలను కలిగి ఉంటుంది.
- నిజాయితీ మరియు కచ్చితమైన జాబితా సమాచారం - ప్రాజెక్ట్‌ల నుండి సూచించబడిన ఏవైనా జాబితాలు నిజాయితీ మరియు కచ్చితమైన సమాచారంతో వస్తాయని ఆశించబడుతుంది. మీ ఉత్పత్తిని "ఓపెన్ సోర్స్" అని ప్రకటించడం వంటి జాబితా సమాచారాన్ని తప్పుదారి పట్టించే ఉత్పత్తులు తీసివేయబడతాయి.
- విజ్ఞాన శాస్త్రానికి ప్రాప్యతను విస్తృతం చేయడానికి నిరూపితమైన నిబద్ధత - ఒక DeSci ప్రాజెక్ట్, కేవలం టోకెన్/NFT హోల్డర్లకు మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలకు విజ్ఞాన శాస్త్రంలో భాగస్వామ్యాన్ని ఎలా విస్తృతం చేస్తుందో వివరించగలగాలి.
- ప్రపంచవ్యాప్తంగా ప్రాప్యత - మీ సేవను ప్రాప్యత చేయకుండా నిర్దిష్ట వ్యక్తులను మినహాయించే భౌగోళిక పరిమితులు లేదా KYC ఆవశ్యకతలు మీ ప్రాజెక్టుకు ఉండకూడదు.
- సమాచార వెబ్‌సైట్ మరియు డాక్యుమెంటేషన్ - ప్రాజెక్ట్ వెబ్‌సైట్ సందర్శకులు, ఆ ప్రాజెక్ట్ వాస్తవానికి ఏమి చేస్తుందో, విజ్ఞాన శాస్త్ర మౌలిక సదుపాయాల వికేంద్రీకరణకు ఎలా దోహదపడుతుందో మరియు ఎలా పాల్గొనాలో అర్థం చేసుకోవడం ముఖ్యం.
- ప్రాజెక్ట్ ఇతీరియము పర్యావరణ వ్యవస్థలో భాగమై ఉండాలి - ethereum.orgలో మేము ఇతీరియము (మరియు దాని లేయర్ 2లు) DeSci ఉద్యమానికి సరైన బేస్ లేయర్ అని నమ్ముతాము.
- ప్రాజెక్ట్ చాలావరకు సుస్థాపితమై ఉండాలి - ఈ ప్రాజెక్ట్‌కు నిజమైన వినియోగదారులు ఉండాలి, వారు చాలా నెలలుగా ప్రాజెక్ట్ సేవలను ప్రాప్యత చేయగలుగుతున్నారు.
మంచివి
- బహుళ భాషలలో లభ్యం - ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు మీ ప్రాజెక్ట్‌ను ప్రాప్యత చేయడానికి వీలుగా, ఇది బహుళ భాషలలోకి అనువదించబడి ఉండాలి.
- విద్యా వనరులు - వినియోగదారులకు సహాయం చేయడానికి మరియు అవగాహన కల్పించడానికి మీ ఉత్పత్తికి చక్కగా రూపొందించబడిన ఆన్‌బోర్డింగ్ అనుభవం ఉండాలి. లేదా కథనాలు లేదా వీడియోల వంటి కంటెంట్ ఎలా చేయాలో రుజువు.
- థర్డ్-పార్టీ ఆడిట్‌లు - మీ ఉత్పత్తికి విశ్వసనీయమైన థర్డ్-పార్టీ ద్వారా వృత్తిపరంగా లోపాల కోసం ఆడిట్ జరిగి ఉండాలి.
- సంప్రదింపు కేంద్రం - ప్రాజెక్ట్ కోసం ఒక సంప్రదింపు కేంద్రం (ఇది DAO లేదా సంఘం నుండి ఒక ప్రతినిధి కావచ్చు) ఉండటం వలన, మార్పులు చేసినప్పుడు కచ్చితమైన సమాచారాన్ని పొందడంలో మాకు చాలా సహాయపడుతుంది. ఇది భవిష్యత్తు సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు నిర్వహించగలిగేలా ethereum.orgని నవీకరిస్తుంది.
నిర్వహణ
Ethereum యొక్క ద్రవ స్వభావం వలె, బృందాలు మరియు ఉత్పత్తులు వస్తాయి మరియు వెళ్తాయి మరియు ఆవిష్కరణలు ప్రతిరోజూ జరుగుతాయి, కాబట్టి మేము మా కంటెంట్‌ని సాధారణ తనిఖీలను చేస్తాము:
- జాబితా చేయబడిన అన్ని ప్రాజెక్ట్‌లు ఇప్పటికీ మా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి
- ప్రస్తుతం జాబితా చేయబడిన వాటి కంటే మా ప్రమాణాలకు అనుగుణంగా సూచించబడిన ఉత్పత్తులు లేవని ధృవీకరించండి
Ethereum.org ఓపెన్ సోర్స్ సంఘం ద్వారా నిర్వహించబడుతుంది & దీనిని ఎప్పటికప్పుడు తాజాపరచడంలో సహాయం కోసం మేము సంఘంపై ఆధారపడతాము. మీరు జాబితా చేయబడిన ప్రాజెక్ట్‌ల గురించిన ఏదైనా సమాచారాన్ని అప్‌డేట్ చేయవలసి ఉన్నట్లయితే, దయచేసి మా GitHub రిపోజిటరీలో ఒక సమస్యను లేదా పుల్ అభ్యర్థనను తెరవండి.
వినియోగ నిబంధనలు
దయచేసి మా వినియోగ నిబంధనలను కూడా చూడండి. Ethereum.orgలోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది.
పేజీ చివరి అప్‌డేట్: 17 ఆగస్టు, 2025