ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి

మీ వాలెట్‌లో మీ NFTని ఎలా చూడాలి (NFT ట్యుటోరియల్ సిరీస్‌లో పార్ట్ 3/3)

ERC-721
Alchemy
Solidity
ప్రారంభ
Sumi Mudgil
22 ఏప్రిల్, 2021
1 నిమిషం పఠనం

ఈ ట్యుటోరియల్ NFT ట్యుటోరియల్ సిరీస్‌లో పార్ట్ 3/3, ఇక్కడ మనం కొత్తగా మింట్ చేసిన NFTని చూస్తాము. అయినప్పటికీ, మీరు Mainnet లేదా ఏదైనా టెస్టునెట్‌లో సహా MetaMaskను ఉపయోగించి ఏదైనా ERC-721 టోకెన్ కోసం సాధారణ ట్యుటోరియల్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఇతీరియములో మీ స్వంత NFTని ఎలా మింట్ చేయాలో నేర్చుకోవాలనుకుంటే, మీరు ఒక NFT స్మార్ట్ కాంట్రాక్ట్‌ను ఎలా రాయాలి & అమలు చేయాలి అనే దానిపై పార్ట్ 1ను చూడాలి!

అభినందనలు! మీరు మా NFT ట్యుటోరియల్ సిరీస్‌లో అతి చిన్న మరియు సరళమైన భాగానికి చేరుకున్నారు — ఒక వర్చువల్ వాలెట్‌లో మీ కొత్తగా మింట్ చేసిన NFTని ఎలా చూడాలి. ఈ ఉదాహరణ కోసం మేము MetaMaskను ఉపయోగిస్తాము ఎందుకంటే దీనిని మేము ముందున్న రెండు భాగాలలో ఉపయోగించాము.

ముందస్తు అవసరంగా, మీరు ఇప్పటికే మీ మొబైల్‌లో MetaMaskను ఇన్‌స్టాల్ చేసి ఉండాలి, మరియు దానిలో మీరు మీ NFTని మింట్ చేసిన అకౌంట్ ఉండాలి — మీరు ఈ యాప్‌ను iOSopens in a new tab లేదా Androidopens in a new tabలో ఉచితంగా పొందవచ్చు.

దశ 1: మీ నెట్‌వర్క్‌ను Sepoliaకు సెట్ చేయండి

యాప్ పైభాగంలో, “వాలెట్” బటన్‌ను నొక్కండి, ఆ తర్వాత నెట్‌వర్క్‌ను ఎంచుకోమని మిమ్మల్ని అడుగుతుంది. మా NFT Sepolia నెట్‌వర్క్‌లో మింట్ చేయబడినందున, మీరు మీ నెట్‌వర్క్‌గా Sepoliaను ఎంచుకోవాలి.

MetaMask మొబైల్‌లో Sepoliaను మీ నెట్‌వర్క్‌గా ఎలా సెట్ చేయాలి

దశ 2: మీ సేకరించదగినదాన్ని MetaMaskకు జోడించండి

మీరు Sepolia నెట్‌వర్క్‌లో ఉన్న తర్వాత, కుడి వైపున ఉన్న “సేకరించదగినవి” ట్యాబ్‌ను ఎంచుకుని, NFT స్మార్ట్ కాంట్రాక్ట్ చిరునామా మరియు మీ NFT యొక్క ERC-721 టోకెన్ IDని జోడించండి — దీనిని మీరు మా ట్యుటోరియల్‌లోని పార్ట్ IIలో అమలు చేయబడిన మీ NFT నుండి లావాదేవీ హాష్ ఆధారంగా Etherscanలో కనుగొనగలరు.

మీ లావాదేవీ హాష్ మరియు ERC-721 టోకెన్ IDని ఎలా కనుగొనాలి

మీ NFTని చూడటానికి మీరు కొన్ని సార్లు రిఫ్రెష్ చేయవలసి రావచ్చు — కానీ అది అక్కడ ఉంటుంది !

మీ NFTని MetaMaskకు ఎలా అప్‌లోడ్ చేయాలి

అభినందనలు! మీరు విజయవంతంగా ఒక NFTని మింట్ చేసారు, మరియు మీరు ఇప్పుడు దానిని చూడవచ్చు! మీరు NFT ప్రపంచాన్ని ఎలా ఉర్రూతలూగిస్తారో చూడటానికి మేము వేచి ఉండలేము!

పేజీ చివరి అప్‌డేట్: 4 డిసెంబర్, 2023

ఈ ట్యుటోరియల్ ఉపయోగపడిందా?