ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి

పేజీ చివరగా అప్‌డేట్ చేయబడింది: 22 అక్టోబర్, 2025

ఒక Ethereum అకౌంట్‌ను ఎలా తాయారు చేసుకోవాలి

ఎవరైనా ఉచితంగా Ethereum ఖాతాను సృష్టించుకోవచ్చు. మీరు క్రిప్టో వాలెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. వాలెట్లు మీ Ethereum ఖాతాను సృష్టించి, నిర్వహిస్తాయి. అవి లావాదేవీలను పంపగలవు, మీ బ్యాలెన్స్‌లను తనిఖీ చేయగలవు మరియు Ethereum మీద నిర్మించిన ఇతర యాప్‌లకు మిమ్మల్ని కనెక్ట్ చేయగలవు.

వాలెట్‌తో మీరు తక్షణమే ఏదైనా టోకెన్ ఎక్స్ఛేంజ్, గేమ్‌లు, మార్కెట్‌ప్లేస్‌లలోకి లాగిన్ అవ్వవచ్చు. వ్యక్తిగత రిజిస్ట్రేషన్ అవసరం లేదు, Ethereum మీద నిర్మించిన అన్ని యాప్‌ల కోసం ఒకే ఖాతా భాగస్వామ్యం చేయబడుతుంది.

స్టెప్ 1: ఒక వాలెట్ ని ఎన్నుకో

వాలెట్ అనేది ఒక అప్ దాని ద్వారా మీరు మీ ఇతిరియం అకౌంట్ ని మేనేజ్ చెయ్యొచ్చు. ఎంచుకోవడానికి డజన్ల కొద్దీ విభిన్న వాలెట్‌లు ఉన్నాయి: మొబైల్, డెస్క్‌టాప్ లేదా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు కూడా.

వాలెట్‌ల జాబితా

మీరు ఇందులో కొత్త అయితే, మీరు "క్రిప్టో కి కొత్త" ఫిల్టర్ ని సెలెక్ట్ చేయండి "వాలెట్ వెతకడం" పేజీ లో దాని ద్వారా మీరు ఏమేమి నేర్చుకోవాలి ఏవేవి తెలుసుకోవాలో అన్ని తెలుసుకుంటారు.

‘వాలెట్‌ను కనుగొనండి’ పేజీలో ఫిల్టర్ ఎంపిక

ఎన్నో ప్రొఫైల్ ఫిల్టర్లు కూడా ఉన్నాయ్ మీ అవసరాలని తీర్చుకోడానికి. కామన్ గా వాడే వాల్లెట్స్ ఉన్నపటికీ - మీరు మీ స్వతఃగా రీసెర్చ్ చేయండి ఏదైనా కంపెనీ ని నమ్మే ముందు.

స్టెప్ 2: వాలెట్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి

మీరు ఒక వాలెట్ ని నిశ్చయించి కొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి, వాటి యొక్క ఆఫిసిఅల్ వెబ్సైటు కు గాని లేదా అప్ స్టోర్ ని సంప్రదించండి. అందులో చాలా ఉచితం గానే లభిస్తాయి.

దశ 3: యాప్‌ను తెరిచి, మీ Ethereum ఖాతాను సృష్టించండి

మీరు మొదట ఓపెన్ చేసేటప్పుడు మీరు కొత్త వాలెట్ తాయారు చేసుకుంటున్నారా లేదా ఉన్న అకౌంట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది. కొత్త అకౌంట్ తాయారి పై క్లిక్ చేయండి. వాలెట్ సాఫ్ట్‌వేర్ మీ Ethereum ఖాతాను రూపొందించే దశ ఇది.

స్టెప్ 4: మీ రికవరీ ఫ్రస్ ని పొందు పరచండి

కొన్ని యాప్‌లు మిమ్మల్ని ఒక రహస్య "రికవరీ ఫ్రేజ్" (కొన్నిసార్లు "సీడ్ ఫ్రేజ్" లేదా "నిమోనిక్" అని పిలుస్తారు)ని సేవ్ చేయమని అభ్యర్థిస్తాయి. ఈ పదబంధాన్ని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం! ఇది మీ Ethereum ఖాతాను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది మరియు లావాదేవీలను సమర్పించడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఆ పదబంధం తెలిసిన ఏ వ్యక్తి అయినా అన్ని నిధులను నియంత్రణలోకి తీసుకోగలడు. దీన్ని ఎవరితోనూ ఎప్పుడూ పంచుకోవద్దు. ఈ పదబంధంలో యాదృచ్ఛికంగా రూపొందించిన 12 నుండి 24 పదాలు ఉండాలి (పదాల క్రమం ముఖ్యం).

ఇతర గైడ్‌లపై ఆసక్తి ఉందా? మా వీటిని చూడండి: దశల వారీ గైడ్‌లు

తరచుగా అడిగే ప్రశ్నలు

నా వాలెట్ మరియు నా ఇతిరియం అకౌంట్ ఒకటేనా?

లేదు. వాలెట్ అనేది ఒక పని ముట్టు లాంటిది దాని ద్వారా మీరు మీ అకౌంట్స్ ని మేనేజ్ చెయ్యొచ్చు. ఒకే వాలెట్ అనేక ఖాతాలను యాక్సెస్ చేయగలదు మరియు ఒకే ఖాతాను బహుళ వాలెట్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. రికవరీ పదబంధం ఖాతాలను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది మరియు ఆస్తులను నిర్వహించడానికి వాలెట్ యాప్‌కు అనుమతి ఇస్తుంది.

నేను బిట్ కాయిన్ ని ఇతిరియం అడ్రస్ కి పంపించొచ్చా, లేదంటే ఇతెర్ ని బిట్ కాయిన్ అడ్రస్ కి పంపించొచ్చా?

లేదు, మీరు చెయ్యలేరు. బిట్‌కాయిన్ మరియు ఈథర్ రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లలో (అంటే, వేర్వేరు బ్లాక్‌చైన్‌లు) ఉన్నాయి, ప్రతిదానికి దాని స్వంత బుక్‌కీపింగ్ మరియు చిరునామా ఫార్మాట్‌లు ఉంటాయి. రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లను అనుసంధానించడానికి వివిధ ప్రయత్నాలు జరిగాయి, వాటిలో ప్రస్తుతం అత్యంత చురుకైనది వ్రాప్డ్ బిట్‌కాయిన్ లేదా WBTCopens in a new tab. ఇది ఒక ఆమోదం కాదు, WBTC అనేది ఒక జవాబు(అంటే ఒక గుంపు లో మనుషులు దాని యొక్క ముఖ్యమైన ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తారు) మరియు అది ఇక్కడ సమాచారం తెలుసుకోవడం కోసమే ఉంది.

ఇప్పుడు నా దగ్గర ఇత్ అడ్రస్ ఉంటె, ఇతర బ్లాక్ చైన్ లలో కూడా అదే అడ్రస్ ఉంటాదా?

Ethereum మాదిరిగానే అంతర్లీన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అన్ని బ్లాక్‌చైన్‌లలోనూ మీరు అదే ను ఉపయోగించవచ్చు (దీనిని 'EVM-అనుకూల' అని పిలుస్తారు). ఈ జాబితాopens in a new tab మీరు ఏ బ్లాక్‌చెయిన్‌లను అదే చిరునామాతో ఉపయోగించవచ్చో మీకు చూపుతుంది. కొన్ని బ్లాక్ చైన్లు, ఉదాహరణ కు బిట్ కాయిన్, పూర్తిగా విభిన్న నెట్వర్క్ రూల్స్ ని పాటిస్తాది వాటికోసం మీకు ఇంకో అడ్రస్ ఫార్మటు తో వేరేయ్ అడ్రస్ కావాలి. మీకు స్మార్ట్ కాంట్రాక్ట్ వాలెట్ ఉంటే, ఏ బ్లాక్‌చెయిన్‌లకు మద్దతు ఉందో మరింత సమాచారం కోసం మీరు దాని ఉత్పత్తి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలి, ఎందుకంటే సాధారణంగా వాటికి పరిమితమైన కానీ మరింత సురక్షితమైన పరిధి ఉంటుంది.

ఒక ఎక్స్చేంజి లో డబ్బు ఉంచడం కన్నా నా వాలెట్ లో డబ్బు ఉంచడం సురక్షితమేనా?

మీ వాలెట్ మీ దగ్గరే ఉంది అంటే మీ డబ్బు సురక్షితాన్ని మరియు వాటి భాద్యత ని మీరు తీసుకున్నట్టే. దురదృష్టవశాత్తు చాలా ఎక్స్చేంజి లు విఫలం అయ్యి కస్టమర్ల డబ్బు పోగొట్టిన ఉదాహరణలు చాలా ఉన్నాయ్. వాలెట్‌ను (రికవరీ పదబంధంతో) కలిగి ఉండటం వలన మీ ఆస్తులను ఉంచడానికి కొంత సంస్థను విశ్వసించడంతో సంబంధం ఉన్న ప్రమాదాన్ని తొలగిస్తుంది. అయితే, మీరు దానిని మీ స్వంతంగా భద్రపరచుకోవాలి మరియు ఫిషింగ్ స్కామ్‌లు, అనుకోకుండా లావాదేవీలను ఆమోదించడం లేదా రికవరీ పదబంధాన్ని బహిర్గతం చేయడం, నకిలీ వెబ్‌సైట్‌లతో పరస్పర చర్య చేయడం మరియు ఇతర స్వీయ-సంరక్షణ ప్రమాదాలను నివారించాలి. లాభాలు నష్టాలు చాలా విభిన్నం.

నేను నా ఫోన్ గాని హార్డ్వేర్ వాలెట్ గాని కోల్పోతే, నేను అదే వాలెట్ ని ఉపయోగించి డబ్బు ని రికవర్ చెయ్యొచ్చా?

లేదు, మీరు ఇంకో వాలెట్ ని ఉపయోగించొచ్చు. మీ సీడ్ ఫ్రస్ మీ దగ్గర ఉన్నపటికీ, మీరు ఆ ఫ్రస్ ని ఎన్ని వాల్లెట్స్ లో ఐన కొట్టొచ్చు మరియు అవి మీ అకౌంట్ ని రికవర్ చేస్తాయి. అయినప్పటికీ ఇలా చేసేటప్పుడు జాగ్రతగా ఉండండి: మీరు ఇది చేసేటప్పుడు మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వకపోడం మంచిది ఆలా చేస్తే మీ సీడ్ ఫ్రస్ ఆక్సిడెంట్ల్ గా లీక్ అవ్వదు. రికవరీ పదబంధం లేకుండా కోల్పోయిన నిధులను తిరిగి పొందడం చాలాసార్లు అసాధ్యం.

పేజీ చివరి అప్‌డేట్: 22 అక్టోబర్, 2025

ఈ ఆర్టికల్ ఉపయోగపడిందా?