సహకారుల కృతజ్ఞతలు
అనువాద కార్యక్రమం ఒక సమిష్టి కృషి మరియు వెబ్‌సైట్‌ను వీలైనన్ని ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంచడంలో మాకు సహాయపడటానికి వేలాది మంది కంట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా తమ సమయాన్ని కేటాయించి పాలుపంచుకున్నారు.
ఈ పేజీ మా అనువాదకులను, వారి ప్రయత్నాలను గుర్తించడానికి, మా అత్యుత్తమ కంట్రిబ్యూటర్లను హైలైట్ చేయడానికి మరియు వారి వృత్తిపరమైన ప్రయాణంలో వారికి మద్దతు ఇవ్వడానికి అంకితం చేయబడింది.
Crowdinలోని మా ప్రాజెక్ట్‌లో చురుకుగా ఉన్న అనువాదకులందరూ మా కంట్రిబ్యూటర్ల పేజీలో ప్రదర్శించబడతారు. ethereum.org అనువాదకులందరినీ వీక్షించండి.
ఒక నిర్దిష్ట కాలంలో అత్యంత చురుకైన అనువాదకులు అనువాద లీడర్‌బోర్డ్‌లో కూడా తమ స్థానాన్ని సంపాదిస్తారు.


