అనువాద లీడర్‌బోర్డ్
ఇటీవలి కార్యాచరణ ఆధారంగా అత్యుత్తమ అనువాదకులను ప్రదర్శించడంతో పాటు మా అత్యంత ప్రభావవంతమైన ఆల్-టైమ్ కంట్రిబ్యూటర్లను హైలైట్ చేయాలనుకుంటున్నాము. మా లీడర్‌బోర్డ్ నెలవారీ, త్రైమాసిక మరియు ఆల్-టైమ్ వీక్షణను ఉపయోగించి అత్యంత చురుకైన అనువాదకుల డేటాను ట్రాక్ చేస్తుంది మరియు ప్రతి నెల ప్రారంభంలో నవీకరించబడుతుంది. అనువాదకులు వారి ''గెలిచిన'' పదాల సంఖ్య (సమీక్ష సమయంలో ఆమోదించబడిన అనువదించబడిన పదాల సంఖ్య) ఆధారంగా లీడర్‌బోర్డ్‌లలో ఉంచబడతారు.
మా అనువాదకులు
ethereum.org అనువాద ప్రోగ్రామ్‌కు కమ్యూనిటీయే గుండెకాయ. దిగువన ఉన్న మా పూర్తి అనువాదకుల కమ్యూనిటీని అన్వేషించండి.

అనువాదకులందరినీ వీక్షించండి
ఎథీరియం కంటెంట్‌ను అందరికీ అందుబాటులో ఉంచడంలో సహాయపడటానికి తమ సమయాన్ని మరియు నైపుణ్యాలను వెచ్చించే మా అనువాదకుల పూర్తి జాబితాను చూడండి.
సర్టిఫికేట్
మేము మా అనువాదకులను గుర్తించి, వారి కెరీర్ మార్గాల్లో వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము ethereum.org అనువాదకుని సర్టిఫికేట్‌ను రూపొందించాము.
ఈ సర్టిఫికేట్ వృత్తిపరమైన మరియు రాబోయే అనువాదకుల కోసం ఉద్దేశించబడింది, వారు దీనిని రిఫరెన్స్‌గా ఉపయోగించాలనుకుంటున్నారు, సాంకేతిక కంటెంట్‌ను అనువదించడంలో వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు లేదా ఎథీరియం పట్ల వారి అంకితభావాన్ని చూపించాలనుకుంటున్నారు.
మీరు అనువాద ప్రోగ్రామ్‌కు సహకరించి, మీరు అనువదించిన పదాలలో కనీసం 5,000 ఆమోదించబడితే, మీరు translations@ethereum.org కు వ్రాయడం ద్వారా మీ అనువాదకుని సర్టిఫికేట్‌ను అభ్యర్థించవచ్చు. మీ సందేశం లో మీ Crowdin ఖాతా లింక్ మరియు మీ పూర్తి పేరు (లేదా మీరు కోరుకుంటే మారుపేరు) ఉండాలి, దానిని మేము సర్టిఫికేట్‌కు జోడిస్తాము.

OATలు
అనువాద ప్రోగ్రామ్‌కు కంట్రిబ్యూటర్లు వివిధ OATలకు (ఆన్‌చైన్ అచీవ్‌మెంట్ టోకెన్‌లు) అర్హులు – ఇవి ethereum.org అనువాద ప్రోగ్రామ్‌లో వారి భాగస్వామ్యాన్ని నిరూపించే నాన్-ఫంగిబుల్ టోకెన్‌లు.
అనువాదకుల కార్యాచరణ ఆధారంగా వారికి అందుబాటులో ఉన్న అనేక విభిన్న OATలు మా వద్ద ఉన్నాయి.
మీరు Crowdin లో అనువాద ప్రయత్నానికి సహకరించి ఉంటే, మీ కోసం ఒక OAT వేచి ఉంది!
ఎలా క్లెయిమ్ చేయాలి
- మా డిస్కార్డ్ సర్వర్‌లో చేరండి (opens in a new tab)
- #🥇 | proof-of-contribution ఛానెల్‌లో మీ Crowdin ఖాతా లింక్‌ను పేస్ట్ చేయండి.
- మీ OATలను క్లెయిమ్ చేయడానికి అవసరమైన పాత్రలను మా బృందంలోని సభ్యుడు మీకు కేటాయించే వరకు వేచి ఉండండి.
- మీ OATలను క్లెయిమ్ చేయండి!
OATలను క్లెయిమ్ చేయడానికి మీరు స్వయం సంరక్షణ వాలెట్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఎక్స్ఛేంజ్ ఖాతాలను లేదా ప్రైవేట్ కీలు మీ వద్ద లేని ఇతర ఖాతాలను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇవి మీ OATలను యాక్సెస్ చేయడానికి మరియు నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతించవు.
