ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్స్ (IDEలు)
ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ (IDE) (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)ని సెటప్ చేసే విషయానికి వస్తే, ఎథీరియంపై అప్లికేషన్‌లను ప్రోగ్రామింగ్ చేయడం అనేది మరే ఇతర సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ను ప్రోగ్రామింగ్ చేసినట్లే ఉంటుంది. ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి, కాబట్టి అంతిమంగా, మీ ప్రాధాన్యతలకు బాగా సరిపోయే IDE లేదా కోడ్ ఎడిటర్‌ను ఎంచుకోండి. బహుశా మీ ఎథీరియం డెవలప్‌మెంట్ కోసం ఉత్తమమైన IDE ఎంపిక, మీరు ఇప్పటికే సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగిస్తున్న IDE కావచ్చు.
వెబ్-ఆధారిత IDEలు
మీరు లోకల్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్‌ను సెటప్ చేయడానికి ముందు కోడ్‌తో ప్రయోగాలు చేయాలని చూస్తున్నట్లయితే, ఈ వెబ్ యాప్‌లు ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
Remix (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - అంతర్నిర్మిత స్టాటిక్ అనాలిసిస్ మరియు టెస్ట్ బ్లాక్‌చైన్ వర్చువల్ మెషీన్‌తో కూడిన వెబ్-ఆధారిత IDE
ChainIDE (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - క్లౌడ్-ఆధారిత మల్టీ-చైన్ IDE
Replit (Solidity స్టార్టర్ - బీటా) (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - హాట్ రీలోడింగ్, ఎర్రర్ చెకింగ్ మరియు ఫస్ట్-క్లాస్ టెస్ట్‌నెట్ మద్దతుతో ఎథీరియం కోసం అనుకూలీకరించదగిన డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్
Tenderly శాండ్‌బాక్స్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Solidity మరియు JavaScript ఉపయోగించి బ్రౌజర్‌లోనే స్మార్ట్ కాంట్రాక్ట్‌లను వ్రాయడానికి, అమలు చేయడానికి మరియు డీబగ్ చేయడానికి వీలు కల్పించే వేగవంతమైన ప్రోటోటైపింగ్ ఎన్విరాన్‌మెంట్
EthFiddle (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - మీ స్మార్ట్ కాంట్రాక్ట్‌ను వ్రాయడానికి, కంపైల్ చేయడానికి మరియు డీబగ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే వెబ్-ఆధారిత IDE
డెస్క్‌టాప్ IDEలు
చాలా వరకు స్థిరపడిన IDEలు ఎథీరియం డెవలప్‌మెంట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లగిన్‌లను నిర్మించాయి. కనీసం, అవి స్మార్ట్ కాంట్రాక్ట్ భాషల కోసం సింటాక్స్ హైలైటింగ్‌ను అందిస్తాయి.
Visual Studio Code - అధికారిక ఎథీరియం మద్దతుతో ప్రొఫెషనల్ క్రాస్-ప్లాట్‌ఫారమ్ IDE
- Visual Studio Code (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- కోడ్ నమూనాలు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- GitHub (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
JetBrains IDEలు (IntelliJ IDEA, మొదలైనవి) - సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు మరియు బృందాలకు అవసరమైన సాధనాలు
- JetBrains (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- GitHub (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- IntelliJ Solidity (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
Remix డెస్క్‌టాప్ - మీ లోకల్ మెషీన్‌లో Remix IDEని అనుభవించండి
ప్లగిన్‌లు మరియు ఎక్స్‌టెన్షన్‌లు
- solidity (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Visual Studio Code కోసం ఎథీరియం Solidity భాష
- VS Code కోసం Solidity + Hardhat (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Hardhat బృందం ద్వారా Solidity మరియు Hardhat మద్దతు
- Prettier Solidity (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - prettier ఉపయోగించి కోడ్ ఫార్మాటర్
మరింత చదవడానికి
- ఎథీరియం IDEలు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Alchemy వారి ఎథీరియం IDEల జాబితా
మీకు సహాయపడిన కమ్యూనిటీ వనరు గురించి తెలుసా? ఈ పేజీని సవరించి, దాన్ని జోడించండి!